![]() |
![]() |
1982లో బి.ఆర్.చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘నిఖా’ చిత్రం ద్వారా నటిగా, గాయనిగా పరిచయమైంది సల్మా ఆఘా. మొదటి సినిమాతోనే నటిగా, గాయనిగా మంచి పేరు తెచ్చుకొని బిజీ అయిపోయింది. పాకిస్థాన్‌కి చెందిన సల్మా మొదట హిందీ సినిమాతోనే పరిచయమైంది. హిందీలో 15 సినిమాల్లో నటించిన సల్మా.. 25 వరకు పాకిస్థానీ సినిమాలు చేశారు. 1980 దశకంలో సల్మా ఆఘా వాయిస్‌కి యూత్ ఫిదా అయిపోయింది. ఆమె పాడిన పాటలకు ఎంతో పాపులారిటీ వచ్చింది. మొదటి సినిమా ‘నిఖా’లోని ‘దిల్‌కే అర్మా..’ అనే పాట చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలోని అన్ని పాటలూ సూపర్‌హిట్టే. ఆ తర్వాత ‘కసమ్ పైదా కర్నే వాలే కి’ చిత్రంలో మిథున్ చక్రవర్తితో కలిసి నటించడమే కాకుండా అందులోని పాటలన్నీ పాడారు. నటిగా, గాయనిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సల్మా వ్యక్తిగత జీవితం మాత్రం గందరగోళంగానే ఉండేది.
సినిమాల్లోకి రాకముందే 1980 ప్రాంతంలో లండన్‌కి చెందిన వ్యాపార వేత్త అయాజ్ సిప్రాతో ప్రేమ వ్యవహారం నడిపింది. కానీ, పెళ్లి చేసుకోలేదు. 1981లో పాకిస్థానీ నటుడు జావేద్ షేక్‌ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహ బంధం 1987 వరకు కొనసాగింది. అతని నుంచి విడాకులు తీసుకొని 1989లో స్క్వాష్ ప్లేయర్ రెహమత్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. 2010 వరకు వీరు కలిసే ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2011లో దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త మంజర్‌ఖాన్‌ను వివాహం చేసుకుంది. అయితే అతను దుబాయ్‌లోనే ఉంటాడు. రెహమత్ ఖాన్ వల్ల ఇద్దరు పిల్లలు కలిగారు. వారిలో జారా ఖాన్ నటిగా, సింగర్‌గా బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంటోంది. కూతురి కెరీర్ కోసం సల్మా మాత్రం ముంబాయిలో ఉంటుంది. అలా ముగ్గురి పెళ్లి చేసుకున్న సల్మా ఆఘా ప్రస్తుతం కూతురి కెరీర్ కోసం భర్తకు దూరంగానే ఉంటోంది.
![]() |
![]() |